భారత చైతన్య యువజన పార్టీ

Party Establishment
పార్టీ వ్యవస్థాపన

రాష్ట్ర రాజకీయాలలో సంచలనాలను సృష్టిస్తూ రాష్ట్ర పురోగతికి యువ ప్రజా నాయకుడు రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో నూతన పార్టీ ఆవిర్భావానికి లోతైన కారణాలు.

An Ambition
భారత చైతన్య యువజన పార్టీ

ఒక ఆశయం

ఒక 420 చేతికి బ్యాంకు తాళాలు ఇచ్చినట్టు.. తెలిసో, తెలియకో.. ప్రత్యామ్నాయం లేకనో, సానుభూతికి పడిపోయో.. ఎలాగోలా ఒక గజదొంగకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు ఈ రాష్ట్రప్రజలు! దానికి పర్యవసానం కళ్లెదుటే కనిపిస్తుంది. దోపిడీ, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయి.. రాజ్యాంగం మచ్చుకి కూడా అమలవ్వడం లేదు.. వారిపై పోరాడాల్సిన పార్టీ కూడా నిండా అవినీతి, దోపిడీతో మునిగిపోయింది.. ప్రజా నమ్మకం కోల్పోయింది! అందుకే ఈ నీచ రాజకీయ సంస్కృతి పాలిస్తున్న వేళ.. ఒక కొత్త మూడో ప్రత్యామ్నాయ వేదిక నిర్మించాలి.. "సామాన్యుడి చేతిలో అధికారం ఉండాలి.. ప్రజలే పాలనలో భాగస్వాములు కావాలి.. పేదల కోసం అంకితభావంతో స్థిరమైన పాలన చేయాలి.. అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరగాలి.. కులాహంకార దోపిడీ కూకటివేళ్లతో పెకిలించాలి" అనే ఆశయంతో కొత్త ప్రజా రాజకీయ వేదిక రూపుదిద్దుకుంటుంది!

An Idea
భారత చైతన్య యువజన పార్టీ

ఒక ఆలోచన

మన రాష్ట్రం అందరిదీ. కులాలకు, కల్మషాలకు, కుట్రలకు అతీతంగా కష్టం నమ్ముకుని బతుకుతున్న మధ్యతరగతిది మన రాష్ట్రం! మన రాష్ట్రంపై మనకు శ్రద్ధ ఉంది, బాధ్యత ఉంది. ప్రశాంతమైన రాష్ట్రంలో అధికార మదం ప్రదర్శిస్తున్నది ఎవరు..? రాజ్యాంగం కల్పించిన స్వేచ్చని హరిస్తున్నది ఎవరు..? ప్రశాంతతని పోగొడుతున్నది ఎవరు..?? "అధికార మదమెక్కిన వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా.., ప్రలోభాలకు లొంగకుండా.., ఒత్తిళ్లకు తలొంచకుండా" రాష్ట్రం కోసం యుద్దానికి వెళ్తున్న వ్యక్తిని గెలిపించాల్సిన, నడిపించాల్సిన, యుద్ధానికి సిద్ధం చేయాల్సిన బాధ్యత ఈ పార్టీ ఆలోచన! రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు - గాంధీజీ చెప్పిన వాక్కుతో ఆలోచిస్తే, ఒక్క ఆలోచన చాలు.. ఈ వారసత్వ, సంప్రదాయ అవినీతి పీడ పట్టిన దరిద్రులను దిక్కులు దాటించడానికి ఒకే ఒక్క ఆలోచన చాలు.. ఆ ఆలోచన మాది, మీది!

A Vote
భారత చైతన్య యువజన పార్టీ

ఒక ఓటు

"ఓటు అన్నం పెడుతుందా..? ఓటు సాయం చేస్తుందా..? ఓటు డబ్బు ఇస్తుందా..? ఓటు మద్యం పోస్తుందా..!?" ఏమో.. ఇవన్నీ ఉంటే ఉండవచ్చు, లేకపోవచ్చు..! కానీ.... "ఓటు - ఊరిని బాగు చేస్తుంది..! ఓటు - ప్రశ్నించే హక్కునిస్తుంది..! ఓటు - పల్లెకు స్వేచ్చనిస్తుంది..! ఓటు - గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని తెస్తుంది..!" కానీ... సరైన వారిని ఎన్నుకున్నప్పుడే, సరైన అభ్యర్ధికి ఓటు వేసినప్పుడే ఆ ఓటుకి విలువ, నీకు విలువ..! మరి "నువ్వెటు..? నీ ఓటెటు..? నీ ఊరెటు..? నీ దారెటు..?" పార్టీలను పక్కన పెట్టెయ్.. నిష్కల్మష మనసుతో అయిదు నిమిషాలు ఆలోచించుకో.. ఒక ఓటుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టొచ్చు.. ఆ ఓటు మనదే, మూడో ప్రత్యామ్నాయానిదే!

A Fight
భారత చైతన్య యువజన పార్టీ

ఒక పోరు

రాజ్యాంగం ఏం చెప్పింది..? ప్రత్యర్థులను బెదిరించామని చెప్పిందా..? భయపెట్టి పేద వర్గాలను అణగదొక్కమని చెప్పిందా..!? ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో స్వేచ్ఛను హరించామని చెప్పిందా..? అధికార అండ చూసుకుని కుట్రలతో వేధించామని చెప్పిందా..? అటువంటి ప్రయత్నాలను ఎదిరించిన పోరు ఇది. "ఒక వ్యక్తి పోరు, ఒక రాష్ట్రం పోరు.. మన రాష్ట్ర ప్రగతి కోసం, మన రాష్ట్ర ఆత్మగౌరవం కోసం, మన యువత భవిత కోసం జరుగుతున్న పోరు. పేదల గడ్డపై మీ పేదింటి బిడ్డ పోటీకి దిగిన ఊరి పోరు..!

A Self-Respect
భారత చైతన్య యువజన పార్టీ

ఒక ఆత్మగౌరవం

"ఎన్నిక అంటే డబ్బు, మద్యం తీసుకుని ఓటు వేయడమేనా..!? అలా తీసుకుని, వారికి ఓటు వేస్తే ఊరి, రాష్ట్రం కోసం తిరిగి ప్రశ్నించే అవకాశం ఎక్కడ ఉంటుంది!? ఒక్కసారి ఎన్నికలో పోటీకి దిగితేనే అధికార మదంతో కిడ్నాప్ చేయాలి, బెదిరించాలి, భయపెట్టాలి అని చూసారు..! అటువంటి నీచ నాయకత్వం ఉన్న చోట ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది..!? డబ్బు, మద్యం ఇస్తే ఓటు కొనవచ్చు ఏమో..? కానీ రాష్ట్ర ప్రజల మనసు కొనలేరు. అభివృద్ధిని కొనలేరు. గ్రామాలను కొనలేరు, ఆత్మగౌరవాన్ని కొనలేరు..! అందుకే మన రాష్ట్రం కోసం మనమే రంగంలోకి దిగాలి.. మన ఆత్మగౌరవాన్ని మనమే నిలబెట్టాలి.. అంటే కులాలు, కుట్రలు, కల్మషాలు లేని "స్వేచ్చాయుత రాజకీయం కావాలి, నిండు మనసుతో వేసే స్వచ్ఛమైన ఓటు కావాలి" అందుకే ఈ మూడో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ!

ఈ ఆలోచనలు, ఆశయాలు, నినాదాల నుండి పురుడు పోసుకున్నదే మన "భారత చైతన్య యువజన పార్టీ "!